News March 17, 2025

విశాఖ: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య

image

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధి బాకువరపాలెంలో ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రమేశ్ (25) మద్యానికి బానిసయ్యాడు. భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆదివారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. రమేశ్ భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్‌బాడీని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Similar News

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News March 18, 2025

ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

image

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2025

విశాఖ: అదనపు కోచ్‌లతో రైళ్ల పెంపు

image

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రైలు నెం. 58506/58505 విశాఖపట్నం – గుణుపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ 1×8 నుంచి ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది. రైలు నం. 18512/ 18511 విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 17 తేది నుంచి రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది.

error: Content is protected !!