News April 6, 2024
విశాఖ: మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాలిపేటలోని పాడుబడిన భవనంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ శ్రీనివాస్ జగదాంబ జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో భార్య లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 23, 2025
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: జేసీ

బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసి మయూర్ అశోక్ తెలిపారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా అని తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.
News October 23, 2025
తాడేపల్లి కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర: టీడీపీ

గాజువాకలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర జరిగిందని, జోగి రమేష్ – జనార్ధన్రావుల ప్రమేయంతోనే కల్తీ తయారైందని పల్లా ఆరోపించారు. ఏపీ సురక్షా యాప్ను లాంచ్ చేసి, కల్తీని అరికట్టేందుకు QR కోడ్ విధానం, 13 రకాల టెస్టులు ప్రవేశపెట్టామని చెప్పారు.
News October 23, 2025
విశాఖలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టు

విశాఖ ఎంవీపీ కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన శ్రీరాం గుప్తా, వరప్రసాద్ కలిసి ఒక రూమ్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు దాడి చేశారు. ప్రింటర్స్, ఫోన్లు, కరెన్సీ తయారీ సామాగ్రి, లాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.