News March 29, 2024
విశాఖ: మరికొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది.
Similar News
News December 18, 2025
సింహాచలం దేవస్థానంలో పది రోజులు ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 29 వరకు పగల్ పత్తు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ తిరువీధి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల కారణంగా ఈ పది రోజుల పాటు నిత్యం జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.
News December 18, 2025
భీమిలి తీరానికి కొట్టుకు వచ్చిన తాబేలు, డాల్ఫిన్

భీమిలి తీరానికి డాల్ఫిన్, తాబేలు కొట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు డాల్ఫిన్, ఇతర చేపలు తీరానికి కోట్టుకు రాలేదని జాలర్లు తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీ విడిచి పెడుతున్న వ్యర్ధాల కారణంగా సముద్ర జలాలు కలుషితమయ్యాయని, దీంతో విలువైన మత్స్య సంపద నాశనమౌతోందని వారు ఆవేదన చెందారు. కాలుష్యం వెదజల్లుతున పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
News December 18, 2025
బురుజుపేట: సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాల నిలిపివేత

బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. సహస్ర ఘట్టాభిషేకానికి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టగా సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించనున్నారు.


