News January 30, 2025
విశాఖ: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

విశాఖలో మార్చి 8న జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. విశాఖలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ పాల్గొన్నారు.
Similar News
News February 21, 2025
భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాలి: బొత్స

విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్ కేటగిరీలో వున్న జగన్ భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారన్నారు. జగన్ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు.
News February 21, 2025
పద్మనాభం: వేదవ్యాస్కు రెండో పతకం

చండీగఢ్లో నిర్వహిస్తున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వేదవ్యాస్ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నిర్వహించిన 1000 మీటర్ల పరుగు పోటీలో 34 నిమిషాల 55 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. వేదవ్యాస్ వరుసగా రెండు పతకాలు సాధించడంతో పొట్నూరు ప్రజలు అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకున్నారు.
News February 21, 2025
విశాఖ: ఆర్డీఓపై చర్యలు చేపట్టాలి: ఏపీయూడబ్ల్యూజే

విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.