News February 13, 2026

విశాఖ: మార్చ్ 14న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో మార్జి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం తెలిపారు. లోక్ అదాలత్‌లో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కేసులను అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News March 10, 2026

తిర్యాణి: అడవి సంపద రక్షణకు.. సిలిండర్ మార్గమా..?

image

జాతీయ అడవి, వన్య ప్రాణి పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అడవి సంపదను రక్షించేందుకు ఆ శాఖ అధికారులు అనేక రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అయితే అవి అడవి సంపదను కాపాడుతాయా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఏటా కొన్ని వేల టన్నుల వంట చెరుకు కాలుస్తున్నారని.. గిరిజనులు అడవికి వెళ్లకుండా సిలిండర్ ఉపాయాన్ని అధికారులు ముందట వేసుకున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు అందిస్తారో తెలియాల్సి ఉంది.

News March 10, 2026

ANU: ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్‌ను మంగళవారం కో ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 12 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను పొందవచ్చన్నారు.

News March 10, 2026

BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

image

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.