News February 13, 2026
విశాఖ: మార్చ్ 14న జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో మార్జి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం తెలిపారు. లోక్ అదాలత్‌లో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కేసులను అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.
Similar News
News March 6, 2026
కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.
News March 6, 2026
ఆయిల్ ధరల ప్రభావం జీడీపీపై ఉంటుందా?

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర 10 డాలర్లు పెరిగిన ప్రతీసారి 0.5% జీడీపీ దెబ్బతింటుందంటున్నారు. ఇప్పటికే ముడి చమురు ధర 10 డాలర్ల వరకు పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ జీడీపీపైన ఉంటుందన్నారు. వారం రోజుల్లోనే $69గా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర $78కు పెరిగిందని.. మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగితే అది చమురు ధర $87కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
News March 6, 2026
9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.


