News June 7, 2024
విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్
విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.
Similar News
News December 12, 2024
నా రాజీనామాకు కారణం ఇదే: అవంతి
వైసీపీకి తాను రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని.. తనని కౌంటర్ చేస్తే తిరిగి కౌంటర్ ఇస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ‘ఏ రాజకీయా పార్టీ అయినా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా జరగకపోవడంతోనే ఓడిపోయాం. ఫలితాల తర్వాత కూడా వైసీపీలో తీరు మారలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. ప్రస్తుతం కూటమి పాలన బాగుంది’ అని అవంతి చెప్పారు.
News December 12, 2024
YCPకి గుడ్ బై చెప్పిన అవంతి శ్రీనివాస్ పయనం ఎటు.!
అవంతి శ్రీనివాస్ YCPకి గుడ్ బై చెప్పారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలిసారి MLAగా గెలిచారు. PRP కాంగ్రెస్‌లో విలీనం కావడంతో TDPలో చేరారు. 2014లో MP గెలిచి 19 ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. 2024లో ఓటమితో వైసీపీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఆయన పయనం ఎటు అనేది చూడాల్సి ఉంది.
News December 12, 2024
వైభవంగా సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవం
ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.