News October 22, 2024

విశాఖ: మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

ఐటిఐల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ ఒక ప్రకటన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 28న ప్రభుత్వ ఐటీఐలకు, 30న ప్రైవేటు ఐటీఐలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కళాశాలలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు.

Similar News

News December 15, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

image

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.

News December 15, 2025

విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 299 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 132 ఉండ‌గా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించిన‌వి 24, ఇత‌ర విభాగాల‌కు చెందిన‌వి 67 ఉన్నాయి.

News December 15, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.