News April 12, 2025

విశాఖ మీదుగా కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ -కర్నూలు (08545/46) ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు, విశాఖ -బెంగళూర్ (08581/82) ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు, విశాఖ -తిరుపతి (08547/48) ఏప్రిల్ 16 నుంచి మే 28 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News April 15, 2025

మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 15, 2025

విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

image

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.

News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

error: Content is protected !!