News February 27, 2025
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.
Similar News
News March 15, 2025
విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
News March 15, 2025
విశాఖ జూలో వరుస మరణాలు..!

విశాఖ జూపార్క్‌లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గతంలో అరుదైన జత జిరాఫీలు, ఒక జీబ్రా, నీటి ఏనుగు మృత్యువాత పడ్డాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆసియాటిక్ లయన్‌కు పుట్టిన రెండు సింహపు కూనలు ప్రాణాలు విడిచాయి. గురువారం అనారోగ్యంతో 20 ఏళ్ల చిరుత పులి ప్రాణాలు విడిచింది. ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టి వన్యప్రాణులను కాపాడాలని సందర్శకులు కోరుతున్నారు.
News March 15, 2025
విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.