News May 11, 2024
విశాఖ: మీ నియోజకవర్గంలో విజయం ఎవరిది?

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.
News December 1, 2025
అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 1, 2025
స్టీల్ ప్లాంట్ ఘటనపై విచారణకు ఏఐటీయూసీ డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్ ఘటనపై సీఎండీని విధుల నుంచి దూరంగా ఉంచి, నిపుణులతో జాయింట్ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం లోపం వల్లే బెల్టు తెగిందని, ఉద్యోగులపై నిందలు వేయడం తగదని జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుత రావు మండిపడ్డారు. తప్పుడు మరమ్మతుల వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.


