News February 9, 2025

విశాఖ-ముంబై LTT రైలు రద్దు: డీసీఎం

image

విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు(1/2)

image

విశాఖ నగరంలో భవన నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో GVMC టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధనం ఉంటే వేగంగా, లేకపోతే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా కొందరికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

News February 26, 2026

విశాఖకు రూ.32,373 కోట్ల రుణ లక్ష్యం

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు నాబర్డు రూ.32,373 కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని సూచించారు.