News August 3, 2024
విశాఖ: ముడిచమురు హ్యాండ్లింగ్‌లో రికార్డు సాధించిన పోర్టు
ముడిచమురు హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు సాధించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ముడిచమురు నిర్వహణలో అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. పోర్టు చరిత్రలో అత్యధికంగా ముడిచమురు నిర్వహించినట్లు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. మలేషియాకు చెందిన ఎంటీ ఈగల్ వ్యాలరీ క్రూడ్ ఆయిల్ షిప్ నుంచి 1,60,000 టన్నుల ఆయిల్‌ను హ్యాండ్లింగ్ చేసి తన రికార్డ్‌ను తనే అధిగమించినట్లు ఛైర్మన్ తెలిపారు.
Similar News
News September 13, 2024
ఈ నెల 17 నుంచి ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు: కలెక్టర్
విజయనగరం జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్‌గా జరుపుకుంటామని తెలిపారు.
News September 12, 2024
తిరుపతి, శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.
News September 12, 2024
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. మెంటాడ పర్యటనకు వెళుతుండగా రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.