News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
₹3Cr కోసం తండ్రిని పాముకాటుతో చంపించి..

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకనేది ఒకప్పటి మాట. మానవత్వం మరిచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. తండ్రి గణేశన్(56) పేరుపై ₹3Cr బీమా చేయించి పాము కాటుతో చంపారు దుర్మార్గపు కొడుకులు. OCTలో ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం వీరు నోట్లకు బదులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
News December 20, 2025
మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
Unbelievable: ఈ వెజిటెబుల్ కేజీ రూ.లక్ష

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరల్లో హాప్ షూట్స్ ఒకటి. భారత మార్కెట్లో కేజీ రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటిలోని హ్యుములోన్, లుపులోన్ యాసిడ్స్ క్యాన్సర్ సెల్స్తో పోరాడుతాయని సైంటిస్టులు చెబుతారు. TB వంటి సీరియస్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగిస్తారు. బిహార్, HPలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వందల హాప్ షూట్స్ కలిస్తేనే కేజీ వరకు తూగడం, పండించడంలో సవాళ్లు, కోతలో కష్టమూ భారీ ధరకు కారణాలు.


