News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.
News July 8, 2025
ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.
News July 8, 2025
జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.