News February 27, 2025
విశాఖ మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు

విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 26, 2026
విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.
News February 26, 2026
విశాఖ: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి’

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం చేరవేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్‌ను సంబంధిత అధికారులతో కలిసి గురువారం విశాకలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు పారదర్శకత, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
News February 26, 2026
బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.


