News March 21, 2025

విశాఖ మేయర్ పీఠం కదలనుందా? 

image

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.

Similar News

News November 4, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News November 4, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు సోమవారం పరిహారం అందజేసారు. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన అనకాపల్లికి చెందిన రాపేటి కొండ లక్ష్మి కుటుంబం సభ్యులకు 2లక్షలు, హిట్& రన్ కేసుల్లో గాయపడిన సీతంపేటకు చెందిన చిలకలపూడి సురేష్, గాజువాకకు చెందిన ఇమంది లక్ష్మణరావుకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేసారు. ఇప్పటివరకు 88 మందికి రూ.71 లక్షల పరిహారం అందించారు.

News November 3, 2025

విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

image

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్‌పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.