News March 25, 2025
విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Similar News
News October 19, 2025
దీపావళి.. జీవితాల్లో వెలుగులు నింపాలి: భద్రాద్రి కలెక్టర్

ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 19, 2025
24 ఏళ్ల యువతితో 74 ఏళ్ల తాత పెళ్లి.. ₹2 కోట్ల ఎదురుకట్నం!

ఇండోనేషియాలో తన కన్నా 50 ఏళ్లు చిన్నదైన యువతి(24)ని పెళ్లాడాడో వృద్ధుడు (74). ఇందుకోసం ₹2 కోట్ల ఎదురుకట్నం చెల్లించాడు. తూర్పు జావాలో ఈ నెల 1న అరికాను టార్మాన్ పెళ్లి చేసుకున్నాడు. తొలుత ₹60 లక్షలు ఇస్తామని, తర్వాత ₹1.8 కోట్లు అందజేశాడు. అతిథులకు ₹6 వేల చొప్పున గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ ఫొటోగ్రాఫర్‌కు డబ్బులివ్వకుండా ‘నవ దంపతులు’ అదృశ్యమయ్యారు. అయితే వారు హనీమూన్‌కు వెళ్లారని ఫ్యామిలీ చెబుతోంది.
News October 19, 2025
జూరాలకు తగ్గిన వరద

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో ఆదివారం సాయంత్రం జూరాలకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, వివిధ కాలువల ద్వారా మొత్తం 32,362 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.