News March 25, 2025
విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Similar News
News April 23, 2025
కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.
News April 23, 2025
2PM: HYDలో 78.57% పోలింగ్

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.
News April 23, 2025
పార్వతీపురం మన్యం జిల్లా టాపర్లు వీరే

➤ సాలూరు బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పెద్దపూడి తేజస్విని 592 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది
➤ పార్వతీపురం టీఆర్ఎం స్కూలు విద్యార్థి చక్రిశ, కురుపాం zphs విద్యార్థిని ఎం.రిషిత 591 మార్కులతో సెకండ్ ప్లేస్ సాధించారు
➤ భామిని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన జగదీశ్ 590 మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు.