News April 19, 2024

విశాఖ: మే 11న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 11న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ లోక్ ఆదాలత్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాలు కేసులను పరిష్కరించుకోవచ్చు. పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 13, 2024

వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం

image

విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.

News September 13, 2024

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ

image

ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.

News September 12, 2024

అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

image

జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.