News September 7, 2024
విశాఖ: మోదీ, చంద్రబాబు, పవన్ ఆకృతుల్లో వినాయకులు
విశాఖపట్నం 37వార్డులో వినాయకచవితి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆకృతుల్లో వినాయకులను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Similar News
News October 13, 2024
అల్లూరి: భార్యను నరికి చంపిన భర్త
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త నరికి చంపిన ఘటన నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం గన్నేరుపుట్టులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కత్తితో నరికి పరారయ్యాడు. దంపతులు పని కోసం ఒడిశా నుంచి వచ్చినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
అనకాపల్లిలో దేవర మూవీ విలన్ తారక్ పొన్నప్ప (పశురా)కు సత్కారం
‘దేవర’ మూవీలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప(పశురా) ఆదివారం అనకాపల్లిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ల సంతోశ్, అభిమానులు పొన్నప్పను కలిసి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి అభినందించారు. అభిమాన నటుడి చిత్రంలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప అనకాపల్లి రావడం ఆనందంగా ఉందన్నారు.
News October 13, 2024
విశాఖ: చికెన్, మటన్ షాపుల ముందు బారులు
ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్, మటన్ షాపుల ముందు పలుచోట్ల జనాలు బారులు తీరారు. విజయదశమి శనివారం రావడంతో జంతువధకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారి ఆలయాల వద్ద వేట వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మాంసం చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250, స్కిన్ రూ.240, మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు.