News July 28, 2024
విశాఖ: యాక్సిడెంట్‌లో ఫార్మా ఉద్యోగి మృతి
ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి ఉప్పల రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది బాపట్ల జిల్లా వేమూరు మండలం బుతమల్లి గ్రామం. 2002 నుంచి దివీస్ కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. గాజువాక స్టీల్ లోడ్ తీసుకొని వెళ్లివస్తూ టోల్ ప్లాజా వద్ద మంచినీటి కోసం ఆగి రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 13, 2024
విశాఖ: చికెన్, మటన్ షాపుల ముందు బారులు
ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్, మటన్ షాపుల ముందు పలుచోట్ల జనాలు బారులు తీరారు. విజయదశమి శనివారం రావడంతో జంతువధకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారి ఆలయాల వద్ద వేట వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మాంసం చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250, స్కిన్ రూ.240, మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు.
News October 13, 2024
విశాఖ: ‘అల్పపీడనం ఏర్పడే అవకాశం’
ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
News October 12, 2024
చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు
కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.