News March 30, 2024

విశాఖ యువకుడికి రూ.కోటి ఉపకార వేతనంతో MBA సీటు

image

విశాఖకు చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఎంబీఏ)లో రూ.కోటి ఉపకార వేతనంతో సీటు లభించింది. అమెరికాలోని ఐవీవై లీగ్ యూనివర్సిటీలోనూ సీటు లభించిందని, అయినా స్టాన్ఫోర్డు వర్సిటీలో చేరనున్నట్లు వరుణ్ తెలిపారు. దేశంలో అతికొద్ది మందికి మాత్రమే ఉపకారవేతనంతో కూడిన సీటు లభిస్తుందన్నారు.

Similar News

News October 31, 2025

విశాఖ రైతు బజార్‌లకు 3 వారాలపాటు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలోని అన్ని రైతు బజార్‌లు వచ్చే 3 వారాల పాటు నిరంతరంగా కొనసాగించాలని CEO ఆదేశాలు జారీ చేశారు. వారానికి 7 రోజులు మార్కెట్లు పూర్తిగా ఓపెన్‌గా ఉంచాలని సూచించారు. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీని ఆదేశించారు.

News October 31, 2025

విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

image

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

News October 31, 2025

విశాఖ: నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 3 రోజులుగా కొనసాగిన తుఫాన్ తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత కోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO ప్రేమ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థులను తరగతులకు అనుమతించాలని సూచించారు.