News May 20, 2024

విశాఖ యువతి మోసం.. ఫినాయిల్ తాగిన యువకుడు

image

ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిమ్మాపూర్‌కు చెందిన నాగరాజు యోగా నేర్చుకునేందుకు ఈశా ఫౌండేషన్‌లో చేరాడు. అక్కడ వైజాగ్‌కు చెందిన సంధ్య ప్రియాంకతో ఏర్పడ్డ పరిచయం, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువతి రూ.16లక్షలు తన బంధువుల ఖాతాలోకి వేయించింది. మోసాన్ని తట్టుకోలేక ఫినాయిల్ తాగిన యవకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Similar News

News December 4, 2024

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.

News December 4, 2024

విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.

News December 4, 2024

సింహాచలంలో డిసెంబర్‌లో జరిగే ముఖ్య ఉత్సవాలు

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 2024 డిసెంబర్ నెలలో నిర్వహించబోయే ఉత్సవాలను అధికారులు వెల్లడించారు.11న స్వర్ణ తులసీదళార్చనం, గీతాజయంతి, గ్రామ తిరువీధి, 12న స్వర్ణ పుష్పార్చనం, నృసింహ దీక్ష ప్రారంభం. 13నశ్రీ తాయార్ సన్నిధిని సహస్రనామార్చనం, కృత్తిక, తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం,14న శ్రీ స్వామివారి మాస జయంతి16న నెలగంటు జయంతి కార్యక్రమాల నిర్వహించనున్నారు.