News October 29, 2024
విశాఖ: రంజీ మ్యాచ్‌లో ఆంధ్రా టీం ఓటమి
విశాఖలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ టీం 38 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టుపై విజయం సాధించింది. 158 ఓవర్లలో 500 పరుగులు చేసిన హిమాచల్‌ప్రదేశ్ జట్టు 156 పరుగులు ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రిషి ఆర్ ధావన్ 318 బంతుల్లో 19 ఫోర్లు, రెండు సిక్సులతో 195 పరుగులతో నాట్ అవుట్‌గా నిలిచారు. అనంతరం ఆంధ్ర జట్టు 32.1 ఓవర్లలో 118కి ఆలౌట్ అయ్యి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Similar News
News November 4, 2024
విశాఖ: ప్రాణాలు తీసిన ఈత సరదా
సీతపాలెం వద్ద సముద్రంలో మునిగి ఆదివారం అభిరామ్(21) మృతిచెందాడు. పెందుర్తికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై సీతపాలెం తీరానికి వచ్చారు. వీరిలో సిరిగుడి అభిరామ్ ఒడ్డున రాళ్ల గుట్టలపై ఉండగా ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటానికి సముద్రంలో పడిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో మత్స్యకారులు కాపాడారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.
News November 3, 2024
సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
News November 3, 2024
విశాఖ: ‘అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించాం’
గత ప్రభుత్వం గతంలో ఎక్కడాలేని విధంగా రుషికొండపై అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్మించుకున్నట్లుగా చెప్పడంపై మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.