News February 6, 2025
విశాఖ రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు గురువారం ఉదయం 8:15కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాగర్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 వరకు విశాఖలోనే ఉండి పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8:40కి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లనున్నట్లు వెంకయ్య నాయుడి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 18, 2025
విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
News March 18, 2025
ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 18, 2025
విశాఖ: అదనపు కోచ్‌లతో రైళ్ల పెంపు

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రైలు నెం. 58506/58505 విశాఖపట్నం – గుణుపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ 1×8 నుంచి ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది. రైలు నం. 18512/ 18511 విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 17 తేది నుంచి రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది.