News June 24, 2024
విశాఖ: రూ.1.19 కోట్ల పన్ను వసూలు చేసిన రవాణా శాఖ
బీహెచ్ సీరీస్ వాహనాల కొనుగోలు ద్వారా పన్ను ఎగ్గొట్టే వారిపై రవాణా శాఖ అధికారులు ఉక్కు పాదం మోపారు. 56 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజా రత్నం తెలిపారు. వారి నుంచి అపరాధ రుసుం రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి వాహనదారులపై కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 3, 2024
విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
News November 2, 2024
విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామ్మన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సుధీర్ఘ సమీక్ష చేశారు.
News November 2, 2024
పరవాడ: మహా యజ్ఞం మొదలైంది- హోంమంత్రి
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఆమె మహా యజ్ఞం మొదలైందని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.