News January 19, 2025

విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

image

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.

Similar News

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

image

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.