News November 16, 2024
విశాఖ: రూ.65 కోట్ల విలువ కలిగిన భూమి స్వాధీనం
సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ.65 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 ఎకరాల భూమితో పాటు మరో 4,460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
Similar News
News December 8, 2024
ఏయూకి పూర్వవైభవం తీసుకురావడానికి సహకరించాలి: లోకేశ్
ఏయూకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్నీ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఏయూని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు.
News December 7, 2024
పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత
విశాఖ ఆరిలోవలో నిర్మించిన నూతన పోలీసు స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొనున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఈ భవన నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తూ నేటికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు.
News December 7, 2024
పెందుర్తి: మాదకద్రవ్యాలపై పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.