News July 12, 2024

విశాఖ: ‘రెండో శనివారం సెలవు ఇవ్వాలి’

image

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు రెండవ శనివారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రెండవ శనివారం సెలవుగా ప్రకటించినప్పటికీ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

Similar News

News December 7, 2025

విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.

News December 7, 2025

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్‌ విజయవంతం

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.

News December 7, 2025

గాజువాక: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

గాజువాకలోని ఓ ఇంట్లో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పీ.లక్ష్మి (65) మానసిక వికలాంగుడైన తన చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. రెండో కుమారుడు నాగేశ్వరరావు తల్లిని చూసేందుకు శనివారం ఇంటికి వెళ్లగా.. లక్ష్మి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. గాజువాక ఎస్‌ఐ సూర్యకళ‌ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో చనిపోయి 3-4 రోజులు అయి ఉంటుందన్నారు.