News September 24, 2024
విశాఖ: రెవెన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు
ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహశీల్దారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, 55 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.
Similar News
News October 9, 2024
విశాఖలో హీరో సుధీర్ బాబు సందడి
విశాఖలో ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్ర బృందం బుధవారం సందడి చేసింది. ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర హీరో సుధీర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారన్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, షియాజీషిండే కీలక పాత్రలు పోషించారన్నారు. ఇది తండ్రి, కొడుకుల చుట్టూ తిరిగే కథ అని అన్నారు. ఈ నెల 11న విడుదల అవుతుందని చెప్పారు.
News October 9, 2024
విశాఖ: ఒక్కరే 30మద్యం దుకాణాలకు దరఖాస్తు
విశాఖ జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మద్యం వ్యాపారి ఏకంగా 30దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొందరు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు ఎక్కువగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!
ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.