News August 4, 2024
విశాఖ రేంజ్లో 35 మంది సీఐలు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో వీరిని మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సీఐలు తక్షణమే విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News February 23, 2026
పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

విశాఖలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పారదర్శకగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 133 కేంద్రాల్లో 30,633 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. అలాగే మార్చి 2 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పరీక్షలకు కూడా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
పనితీరు మారకుంటే ఇంటికి వెళ్లండి: కలెక్టర్ ఆగ్రహం

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులకు ఆయన సోమవారం క్లాస్ పీకారు. ‘పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి’ అని ఘాటుగా హెచ్చరించారు. మెమోలు ఇచ్చినా మార్పు రాకపోవడాన్ని తప్పుబడుతూ, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News February 23, 2026
విశాఖ: సేవ పునర్విక పేరుతో దోపిడీ

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా సోమవారం సేవ్ పునర్విక పేరుతో స్కానర్లు పట్టుకుంటూ సేవ పేరుతో ముగ్గురు వ్యక్తులు అనధికార దోపిడీకి తెర లేపారు. కనీసం ఆ పాప పేరు పలకడం తెలియడం లేదు వాళ్లకి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భీమవరానికి చెందిన వారిమని చెబుతున్నారు. స్థానికులు కాదు సేవ తప్పు దోవ పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


