News September 10, 2024
విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులను జారీ చేశారు. నర్సీపట్నం టౌన్లో పనిచేస్తున్న త్రిపురాన క్రాంతికుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న సీఐ వానపల్లి నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐగా, ఎంవీవీ రమణమూర్తిని విజయనగరానికి, బుచ్చిరాజును అనకాపల్లి పీసీఆర్ సీఐగా, జీ.దుర్గాప్రసాద్‌ను అల్లూరి సోషల్ మీడియా సైబర్ సెల్ సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 23, 2026
మధురవాడ: డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక- మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.
News February 23, 2026
విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 23, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.


