News March 13, 2025

విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని వ్యవసాయ మరియు వాణిజ్య శాఖ అధికారులు గురువారం నాడు కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు( రూ/కేజీ)లలో టమాటా రూ.15, ఉల్లిపాయలు రూ.23/28 ,బంగాళాదుంపలు రూ.16, వంకాయలు రూ.34/40/46, బెండకాయలు రూ.46, మిర్చి రూ.28, బరబాటి రూ.36, గోరుచిక్కుడు రూ.36, బీట్రూట్ రూ.20, బీన్స్ రూ.52, కీర రూ.26, దేవుడి చిక్కుడు రూ.64, మునగ రూ.56, అరటికాయలు రూ.38, క్యారెట్ రూ.22/32గా నిర్ణయించారు.

Similar News

News March 16, 2025

విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.

News March 15, 2025

విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

image

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News March 15, 2025

విశాఖ జూలో వరుస మరణాలు..!

image

విశాఖ జూపార్క్‌లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గతంలో అరుదైన జత జిరాఫీలు, ఒక జీబ్రా, నీటి ఏనుగు మృత్యువాత పడ్డాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆసియాటిక్ లయన్‌కు పుట్టిన రెండు సింహపు కూనలు ప్రాణాలు విడిచాయి. గురువారం అనారోగ్యంతో 20 ఏళ్ల చిరుత పులి ప్రాణాలు విడిచింది. ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టి వన్యప్రాణులను కాపాడాలని సందర్శకులు కోరుతున్నారు.

error: Content is protected !!