News March 20, 2024

విశాఖ: రైలులో ప్రసవం చేసిన 108 సిబ్బంది

image

రాయగడ నుంచి విశాఖ వచ్చిన రైలులో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. మతిస్థిమితం లేని మహిళకు పురుటి నొప్పులు రాగా.. రైల్వే పోలీసులు 108కు సమాచారం అందించారు. స్పందించిన కంచరపాలెం 108 మెడికల్ టెక్నీషియన్ శైలజ, పైలెట్ అప్పారావు హుటాహుటిన రైలు వద్దకు వెళ్లి.. నొప్పులు ఎక్కువ కావడంతో రైలులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను కేజీహెచ్‌కు తరలించారు. 108 జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్ వారిని అభినందించారు.

Similar News

News April 10, 2026

బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

image

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్‌ గణేశ్‌తో పాటు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్‌లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.

News April 9, 2026

విశాఖ: ఇరాన్ విద్యార్థుల‌కు ఆర్థిక సాయం చేసిన క‌లెక్ట‌ర్

image

యుద్ధ నేప‌థ్యంలో ఏర్ప‌డిన క్లిష్ట ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ అభిషిక్త్ కిశోర్ రూ.ల‌క్ష ఆర్థిక సాయం అంద‌జేశారు. జిల్లా సంజీవ‌ని నిధి నుంచి రూ.50 వేలు విలువ గ‌ల చెక్కును, క‌న‌కమ‌హాల‌క్ష్మి దేవ‌స్థానం స‌మ‌కూర్చిన రూ.50 వేలు న‌గ‌దును క‌లెక్టర్ త‌న ఛాంబ‌ర్లో గురువారం అందించారు. ఏయూలో ఫార్మ‌సీ కోర్సు చ‌దువుతున్న జినాబ్, సోల్మాజ్ బుధవారం వినతి అందజేశారు.

News April 9, 2026

చందనోత్సవం.. ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు’

image

సింహాచలంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్త్‌ కిషోర్ గురువారం పరిశీలించారు. చందనోత్సవ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఈవో వెంకట్రావు జరుగుతున్న పనులు, చేపడుతున్న భద్రతా చర్యలను కలెక్టర్‌కు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.