News August 7, 2024

విశాఖ: రైలులో విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..

image

విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రైలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతుండగా మేలుకొని కేకలు వేసింది. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నిందితుడిని పట్టుకుని బుధవారం ఉదయం విశాఖలో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు.

Similar News

News September 15, 2024

చింతపల్లి: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణ ప్రాంతంలో స్కూటీ బోల్తా పడి యువతి మృతి చెందింది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో యువతి ధన (25) స్కూటీ అదుపుతప్పడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. గుంతల కారణంగా స్కూటీ అదుపుతప్పిందని, ఈ క్రమంలోనే ధన మృతి చెందినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

News September 14, 2024

సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

image

దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు అనంతగిరి మండలానికి చెందిన సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రాకారం విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంక సాయికుమార్, ఇండియన్ నేవీ ఉద్యోగి దిలీప్ కుమార్ జలపాతంలో గల్లంతయినట్లు తోటి స్నేహితులు తెలిపినట్లు చెప్పారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై SI విచారణ చేపడుతున్నారు.

News September 14, 2024

BREAKING: విశాఖలో భారీ అగ్నిప్రమాదం

image

విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌లోని లిథియం బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.