News November 24, 2024
విశాఖ రైల్వే జోన్‌లో బిల్డింగ్స్ నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
విశాఖలో ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి GM ఆఫీస్, కాంప్లెక్స్ (B2+B1+G+9) భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ ఈ- టెండర్లను ఆహ్వానించింది. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ టెండర్ దాఖలు చేసుకోవచ్చని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఈ భవనాలను రెండు సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
Similar News
News December 9, 2024
విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్
సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it
News December 9, 2024
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: బొత్స
తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్‌బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.
News December 9, 2024
విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్ 22న రద్దు
విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సోరంటోలి చౌక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 23న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.