News April 11, 2024
విశాఖ: రైల్వే లైన్ నిర్మాణానికి నోటిఫికేషన్

విశాఖ జిల్లా పరిధిలో దువ్వాడ-సింహాచలం నార్త్ మధ్య 2,4 నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.2.543 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టే రైల్వే లైన్ను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్గా గుర్తిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే యాక్ట్ -1989లోని సెక్షన్ 2, క్లాస్-37ఏ కింద అధికారాలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును స్పెషల్ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది.
Similar News
News November 23, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
విశాఖలో నాన్వెజ్ ధరలు

విశాఖపట్నంలో ఆదివారం నాన్వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్లెస్ రూ.280కి, విత్స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.


