News April 11, 2024

విశాఖ: రైల్వే లైన్ నిర్మాణానికి నోటిఫికేషన్

image

విశాఖ జిల్లా పరిధిలో దువ్వాడ-సింహాచలం నార్త్ మధ్య 2,4 నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.2.543 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టే రైల్వే లైన్‌ను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే యాక్ట్ -1989లోని సెక్షన్ 2, క్లాస్-37ఏ కింద అధికారాలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును స్పెషల్ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది.

Similar News

News January 25, 2026

విశాఖ ఉత్సవ్‌లో నేడు కామాక్షి లైవ్ వయోలిన్ షో

image

సాగరతీరానా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్కేబీచ్ రోడ్డులో ప్రముఖ సంగీత వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి లైవ్ వయోలిన్ షో నిర్వహించనున్నారు. కామాక్షి ఇండియన్ ఐడల్, పలు మెగా ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.

News January 25, 2026

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం PGRS రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రద్దు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే 112కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే సోమవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీ PGRS యధావిధిగా నిర్వహించనున్నారు.

News January 24, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

image

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.