News June 30, 2024
విశాఖ: రైల్వే స్టేషన్‌లో 21 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు శనివారం 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ ప్రాంతానికి చెందిన శివ పాత్రో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతని వద్ద తనిఖీ చేయగా 21 కిలోల గంజాయి లభించింది. దీనిని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు జీఆర్‌పీ ఏఎస్ఐ మనోహర్ తెలిపారు.
Similar News
News November 1, 2025
విజయనగరం JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్

జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు శుక్రవారం ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థులు రూ.3వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై రుసుము లేకుండా 24 గంటల్లోపే ఆన్లైన్ ద్వారా పత్రాలు పొందవచ్చన్నారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.
News November 1, 2025
VZM: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి షార్ట్ లిస్ట్ విడుదల

విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 91 పోస్టుల భర్తీకి సంబంధించిన ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీల షార్ట్‌లిస్ట్ జాబితా విడుదలైందని ప్రిన్సిపల్ దేవి మాధవి తెలిపారు. అభ్యర్థులు జాబితాను vizianagaram.ap.gov.in, gmcvizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చన్నారు. అభ్యంతరాలను నవంబర్ 1, 3, 4వ తేదీల్లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చు అన్నారు.
News November 1, 2025
VZM: కళ్లద్దాల పంపిణీకు టెండర్లు స్వీకరణ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు సరఫరా చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రారంభమైందని DMHO జీవన రాణి, అంధత్వ నివారణ సంస్థాధికారి త్రినాథరావు తెలిపారు. 3,500 కళ్ల జోళ్లు పంపిణీకి గానూ ఒక కంటి అద్దం ధర ఫ్రేమ్, గ్లాస్, GST సహా రూ.280 మించకూడదన్నారు. ఆసక్తి గల వారు రూ.25,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) తో నవంబర్ 5 సాయంత్రం 5 గంటల లోపు టెండర్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


