News February 26, 2025
విశాఖ రైల్వే స్టేషన్లో DRM ఆకస్మిక తనిఖీ

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.
Similar News
News February 26, 2025
విశాఖ: గాయపడిన యువకుడి మృతి

విశాఖలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైకు తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News February 26, 2025
బీచ్ రోడ్డులో కోటి లింగాలకు అభిషేకం

విశాఖ సాగర తీరంలో నేడు అద్భుత ఘటన జరగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయనున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభ మేళా నుంచి తెచ్చిన జలాలతో ఇలా చేయడం మరొక విశేషం. బీచ్ రోడ్డులో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత దృశ్యాలను కళ్లారా చూడండి. మిస్ కాకండి.
News February 26, 2025
విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్కు తరలించారు.