News May 3, 2024
విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో HSL కాంప్లెక్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. వీరు ముగ్గురు కొమ్మాదిలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు.
Similar News
News February 24, 2026
వీఆర్‌ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్‌ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్‌ఎస్-1లో 1,126 మందికి, వీఆర్‌ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్‌ఎస్‌కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్‌లో మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.
News February 24, 2026
సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.


