News July 4, 2024
విశాఖ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెందుర్తి-పినగాడ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి దేవరాపల్లి మండలం అలమండ గ్రామానికి చెందిన యువతితో ఏడాదిన్నర కిందట పెళ్లిజరిగింది. వీరికి ఓ పాప ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
ఆరిలోవ రైతు బజార్లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

ఆరిలోవ రైతు బజార్లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న డ్రా ద్వారా 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు
News November 4, 2025
విశాఖ: మనస్తాపంతో CA విద్యార్థి ఆత్మహత్య

సీఏ చదువుతున్న విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడి వివరాల ప్రకారం.. CA విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. అన్ని పరీక్షలు పాస్ అయినట్లు ఇంట్లో అబద్దం చెప్పినందుకు మనస్తాపం చెందాడు. దీంతో పరీక్షల నిమిత్తం కొబ్బరి తోటలో తీసుకున్న రూమ్ వద్దే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
News November 4, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్తో నిఘా


