News February 23, 2025
విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అరెస్టు చేసినట్లు ఆదివారం ధ్రువీకరించారు. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిని గుర్తించామని.. వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Similar News
News February 24, 2025
విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ కోసం దశలవారీగా ఆందోళనలు

రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలోని నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంధ్రతోపాటు కాకినాడ జిల్లాకు చెందిన న్యాయవాదులు ఈ తీర్మానం చేశారు. భారీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నిరసనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు.
News February 23, 2025
విశాఖ జిల్లాలో TODAY TOP NEWS

➤విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..! ➤విశాఖ: యువకుడిని కాపాడిన లైఫ్ గాడ్స్ ➤విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్ ➤ శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్‌లకు ప్రత్యేక బస్సులు ➤ విశాఖ: యాక్సిడెంట్‌లో భర్త మృతి.. భార్యకు గాయాలు ➤గాజువాకలో యువకుడు సూసైడ్? ➤విశాఖలో గ్రూప్-2 పరీక్ష.. డ్రోన్లతో నిఘా..! ➤ఆనందపురం హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
News February 23, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -2 మెయిన్ పరీక్ష

విశాఖలో గ్రూప్ -2 మెయిన్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం విశాఖలో 16 కేంద్రాల్లో 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో ఉదయం పరీక్షకు 9,391 మంది హాజరయ్యారు. 1639 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో 9370 మంది హాజరయ్యారు. 1660 మంది రాలేదని అధికారులు తెలిపారు.