News November 12, 2024
విశాఖ: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్
వరకట్న వేధింపులతో విశాఖలో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. 4వ టౌన్ పోలీసల వివరాల ప్రకారం.. దిల్లేశ్వరి అక్కయ్యపాలేనికి చెందిన రాజశేఖర్‌ని పెళ్లిచేసుకుంది. వ్యాపారం కోసం డబ్బులు కావాలని భర్త వేధించడంతో పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తెచ్చింది. అయినప్పటికీ హింసించడంతో ఆదివారం సూసైడ్ చేసుకుంది. దిల్లేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 7, 2024
విశాఖ: అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్
విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.
News December 7, 2024
నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం
సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.
News December 7, 2024
విశాఖ: డీప్ టెక్ సదస్సులో ఏడు ఒప్పందాలు
విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన డీప్ టెక్ సదస్సులో GFST(గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్)కు వివిధ కంపెనీల మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి. విద్య, వైద్య రంగాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ స్టడీస్, మహిళా సాధికారత తదితర అంశాలపై GFSTతో సమగ్ర, జీఎస్‌ఆర్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జర్మన్ వర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు ఎంవోయూలు చేసుకుంది.