News June 14, 2024

విశాఖ: వసతి గృహాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడీ కె.రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్-8, పోస్ట్ మెట్రిక్-14, వసతి గృహాలు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 872, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 672 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వివరాల కోసం MVP కాలనీ, భీమిలిలోని సహాయ సాంఘీక సంక్షేమశాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.

Similar News

News September 9, 2024

వారికి సందేశాలు పంపి అలెర్ట్ చేయాలి: హోం మంత్రి

image

కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తడంతో విజయవాడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరారు. విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు.

News September 9, 2024

‘తీవ్ర సంక్షోభంలో విశాఖ స్టీల్ ప్లాంట్’

image

తీవ్ర సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితిని వివరించారు. వేతనాలు అందక ప్లాంట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 9, 2024

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే: అమర్నాథ్

image

విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.