News April 1, 2025
విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.
Similar News
News April 8, 2025
CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్గా ధర్మేందర్

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
News April 8, 2025
విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో రిషి(7) మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించగా.. బంధువులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం నాడు కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ.కేజీ)లో టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.21, బంగాళదుంపలు రూ.17, మిర్చి రూ.26, పికోడా మిర్చి రూ.60, క్యారెట్ రూ.36, మట్టి చామ రూ.28, చిలకడదుంపలు రూ.40, బద్ద చిక్కుడు రూ.62, మామిడి అల్లం రూ.55, కీరదోస రూ.24, కాలీఫ్లవర్ రూ. 20, బెండ రూ.28, బీరకాయలు రూ.42, వంకాయలు రూ.22/28 గా ధరలు నిర్ణయించారు.