News April 1, 2025

విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

image

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.

Similar News

News December 4, 2025

జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పింది. అదే రోజు కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించింది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జులై 15-23 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News December 4, 2025

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

image

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.

News December 4, 2025

డాలర్.. 12 లక్షల రియాల్స్‌!

image

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్‌ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్‌ గ్రిడ్‌ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్‌ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.