News September 3, 2024

విశాఖ: వాయిదా పడిన పరీక్షలు 5,6 తేదీల్లో నిర్వహణ

image

ఏయూ దూరవిద్యా కేంద్రం పరిధిలో ఈనెల 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈనెల రెండో తేదీన జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసామన్నారు అదేవిధంగా మూడో తేదీన జరగాల్సిన పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలు 5, 6 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.

Similar News

News November 13, 2025

విశాఖలో నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్..

image

CII సమ్మిట్‌కు ముందుగా దేశంలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, CEOలు, విదేశీ రాయబారులతో CM చంద్రబాబు నేడు భేటీ కానున్నారు.
➣ఉదయం నోవాటెల్‌లో ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం
➣‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’- సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్‌
➣మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ
➣ సాయంత్రం‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై కార్యక్రమం
➣ CII నేషనల్ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం

News November 12, 2025

విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

image

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.

News November 12, 2025

విశాఖ: ‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

image

ఆటోరిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, స్కూల్ పిల్లలను ఆరుగురుకి మించి తీసుకెళ్లకూడదని ఉప రవాణా కమీషనర్ ఆర్.సి.హెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. CC బస్సులో, టూరిస్ట్ బస్సులలో అత్యవసర ద్వారానికి అడ్డంగా టైర్లు, లగేజిలు ఉంచకూడదన్నారు. విశాఖలో పార్ట్నర్‌షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాహనాలను నడపాలని సూచించారు.