News September 26, 2024

విశాఖ: వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు

image

విశాఖ జిల్లాలో వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

విశాఖ: వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి బంగారం చోరీ

image

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి ధారపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బంగారమ్మ తల్లి లేఔట్‌లో నివసిస్తున్న వసంత (66) అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా సుమారు ఇంట్లోకి దొంగలు చొరపడ్డారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న సుమారు 10 తులాల బంగారం, 8 తులాల వెండి దోచుకుని పరార్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆరిలోవ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2025

విశాఖ: సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓకు డాక్టరేట్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓరుగంటి నరేష్ కుమార్‌కు డాక్టరేట్ లభించింది. “వర్క్‌ప్లేస్ డైనమిక్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్‌ది ఐటీ సెక్టార్ పోస్ట్ పాండమిక్-ఏ కేస్ స్టడీ ఆన్‌వర్క్ ఫ్రమ్‌హోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై లోతైన అధ్యయనానికి ఈడాక్టరేట్ ప్రదానం చేశారు.

News December 16, 2025

సింహాచలం కొండపై HT లైన్‌లకు గ్రీన్ సిగ్నల్

image

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.